హోంగార్డు కూతురికి షూటింగ్ లో కాంస్య పతకం
రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ లో ప్రతిభ, జాతీయ స్థాయికి ఎంపిక
అక్షితను అభినందించిన పోలీస్ అధికారులు, సిబ్బంది
సదాశివనగర్, నవంబర్ 6: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పెరమ్ స్వామి (హెచ్.జి. 530) చిన్న కుమార్తె పెరమ్ అక్షిత షూటింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించింది.
70వ రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్.ఐ. షూటింగ్ ఛాంపియన్ షిప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అక్షిత అద్భుత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించింది. ఈ విజయంతో జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించింది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అక్షిత సాధించిన ఈ విజయం పట్ల కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులు, సదాశివనగర్ పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, సదాశివనగర్ పోలీస్ సిబ్బంది ఆకాంక్షించారు.

إرسال تعليق