Minister Vs MLA | ఢిల్లీ హోటల్‌లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఘర్షణ - కాంగ్రెస్‌లో కలకలం

ఢిల్లీ హోటల్‌లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఘర్షణ - కాంగ్రెస్‌లో కలకలం

శాంగ్రిలా హోటల్ లాబీలో కొట్టుకున్న మంత్రి, ఎమ్మెల్యే?

డీసీసీ నియామకాల్లో వివాదమే కారణం - పీసీసీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

హైదరాబాద్, నవంబర్ 2: ఢిల్లీలో రాష్ట్ర మంత్రి, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే  మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

వివరాల ప్రకారం, డీసీసీ నియామకాల విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్ లాబీలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. "రూములో వేసి గు* పగలగొడ్తా, నీ గురించి ఏం అనుకుంటున్నావు" అంటూ మంత్రి,  ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం ఇద్దరి మధ్య వ్యక్తిగత దాడికి దిగి ఒకరినొకరు కొట్టుకున్నట్లు సమాచారం.

ఘటన జరిగిన సమయంలో ఓ ఎమ్మెల్యే, ప్రముఖ తెలుగు దినపత్రిక జర్నలిస్ట్ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు చెబుతున్నారు.

మిగతా ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను దూషించి, అవమానపరిచాడని పేర్కొంటూ ఆ ఎమ్మెల్యే పీసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

రైతులు కష్టాల్లో ఉంటే వారిని గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఇలా చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

ఎమ్మెల్యే జోక్యమే ఘర్షణకు కారణం?

సంగారెడ్డి డీసీసీ పదవి విషయంలో తలదూర్చిన ఎమ్మెల్యే - కామారెడ్డి తరహాలోనే పైరవీ

కర్ణాటక ఎంపీ (ఖర్గే అల్లుడు) ద్వారా బేరసారాలు - మంత్రి ఆగ్రహం

ఢిల్లీ హోటల్ ఘర్షణ వెనుక సంగారెడ్డి డీసీసీ పదవి వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా ఎమ్మెల్యే, సంగారెడ్డి డీసీసీ పదవి విషయంలో తలదూర్చి, కామారెడ్డి తరహాలోనే పైరవీతో తన మద్దతుదారుకు పదవి దక్కేలా చేశారని ప్రచారం జరుగుతోంది. కర్ణాటకకు చెందిన ఒక ఎంపీ (ఖర్గే అల్లుడు) ద్వారా బేరసారాలు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో అక్కడి ఎమ్మెల్యేలు, ప్రధానంగా  మంత్రి  తీవ్ర కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా వాసి కాబట్టి అక్కడ రాజకీయాలు చేసే ప్రయత్నాలు అక్కడి నేతలకు నచ్చడం లేదని, ఇక్కడి ఎమ్మెల్యే అక్కడ ఇన్వాల్వ్ అయితే అలాగే ఉంటుందని స్థానిక నేతలు అంటున్నారు.

ఇదే వివాదం ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్ లాబీలో ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి, ఆ తర్వాత ఘర్షణకు దారితీసినట్లు చెబుతున్నారు.

వీరి మధ్య జరిగిన వాగ్యుద్ధం పై విమర్శిస్తున్న బిఆరెస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  వీడియో 👇



Post a Comment

أحدث أقدم