ఎంపీ సురేష్ షెట్కర్ ఆహ్వానంతో తేనీటి విందుకు హాజరైన పోచారం భాస్కర్ రెడ్డి
ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమావేశం - షబ్బీర్ అలీ, సంజీవరెడ్డితో కలిసి పాల్గొన్న భాస్కర్ రెడ్డి
తెలంగాణ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీ - రాజకీయ అంశాలపై చర్చ
న్యూఢిల్లీ, నవంబర్ 2: ఎంపీ సురేష్ షెట్కర్ ఆహ్వానం మేరకు న్యూఢిల్లీ మీనా బాగ్‌లోని ఆయన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.
చలో ఢిల్లీ కార్యక్రమం తర్వాత రోజు జరిగిన ఈ విందులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ విట్టల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఆకుల శ్రీను, సుదర్శన్ రెడ్డి, భిక్కనూరు మండల ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు నియోజకవర్గ రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించుకున్నారు.
అనంతరం తెలంగాణ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఢిల్లీ వచ్చిన కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.





إرسال تعليق