Police Raid | పేకాట స్థావరంపై బాన్సువాడ పోలీసుల మెరుపు దాడి

 

పేకాట స్థావరంపై బాన్సువాడ పోలీసుల మెరుపు దాడి – ఇద్దరు అరెస్ట్

పాత బాన్సువాడ - బీర్కూర్ రోడ్డు బ్రిడ్జి వద్ద దాడి – రూ.500 నగదు, 2 ఫోన్లు స్వాధీనం

బాన్సువాడ, నవంబర్ 3: పాత బాన్సువాడ నుండి బీర్కూర్ వెళ్లే రోడ్డులో బ్రిడ్జి పక్కన బహిరంగ ప్రదేశంలో సాయంత్రం 6 గంటలకు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో బాన్సువాడ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న పరువుగళ్ళ రాజు, పేర్క ప్రదీప్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.500 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడరాదని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

أحدث أقدم