బీర్కూర్ ఉన్నత పాఠశాలలో SGT ఉపాధ్యాయ సంఘం నిరసన
SGT ఉపాధ్యాయులకు MLC ఓటు హక్కు ఇవ్వాలి - GO 25ను సవరించాలి - జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్
CPS రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి - విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టాలి - SGT సంఘం డిమాండ్
బీర్కూర్, నవంబర్ 2:బీర్కూర్ ఉన్నత పాఠశాలలో SGT ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ మాట్లాడుతూ SGT ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ MLC ఓటు హక్కు కల్పించాలని, GO 25ను మార్చాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్నే 104 సార్లు సవరించినప్పుడు SGT ఉపాధ్యాయుల కోసం GOలు మార్చలేరా అని ప్రశ్నించారు.
CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నచోట విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు. కొందరు DDOలు తమ విధులను ఇతర యూనియన్ లీడర్లకు అప్పగించి SGT ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇలాంటివి సహించేది లేదని హెచ్చరించారు. SGT ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, నాగరాజు, శ్రీధర్ భార్గవ్, విట్టల్, శంకర్, సాయికుమార్, రాజు, లావరెడ్డి, ఫణిశ్రీ, జ్యోతి, సుమలత, వసంత తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق