•కలెక్టరేట్లో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
•పాల్గొన్న అడిషనల్ కలెక్టర్
•శోభాయాత్రలో ఎమ్మెల్యే కేవీఆర్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి :
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను కామారెడ్డి కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
అదనపు కలెక్టర్‌తో ప్రారంభం
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాత చిత్రపటానికి పూలమాల అలంకరించారు.
శోభాయాత్రలో ఎమ్మెల్యే
శ్రీశ్రీశ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదిన వేడుకలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం వీక్లీ మార్కెట్ నుంచి నిర్వహించిన శోభాయాత్రలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో వైశ్య సంఘం సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post a Comment