17 లోపు అక్రిడిటేషన్ కార్డు కోసం దరఖాస్తులు
తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, హైదరాబాద్:
కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర,జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ సి హెచ్ ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నగర కేంద్రంగా స్టూడియోలు కలిగి, స్థానికంగా, జిల్లాలలో ప్రసారాలు అందించే చానళ్ళు రాష్ట్ర,జిల్లా స్థాయిలో కార్డులు పొందటానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో స్టూడియోలు కలిగిన వారు ఆయా జిల్లాల్లో కార్డులు పొందటానికి నేరుగా ఈ నెల 17 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తులో ఛానల్ పేరు, స్టూడియో అడ్రస్ తో పాటు, ఎమ్ ఐ బి సర్టిఫికెట్, లేబర్ లైసెన్స్, ఎం ఎస్ ఓ లతో చేసుకున్న ఛానల్ ప్లేస్మెంట్ అగ్రిమెంట్ల కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.అర్హత గల ఛానళ్లకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అక్రిడేషన్స్ జారీ చేయబడతాయని వివరించారు.
.jpeg)
Post a Comment