₹106 కోట్లతో నిర్మాణం
'పోచారం' పర్యవేక్షణ నిరంతరం
తెలంగాణ డైలీ న్యూస్, వర్ని/చందూర్:
ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిరకాల స్వప్నమైన బాన్సువాడ నియోజక వర్గంలోని నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియా 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి ₹106 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల ఎట్టకేలకు పూర్తి అయింది. ఈ మేరకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. మోటారు బటన్ వేసిన వెంటనే నీరు గలగలా పారడంతో ఎమ్మెల్యే పోచారం సహా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
త్వరలో ప్రారంభించనున్న వర్ని మండలం జాకొర,చందూర్ ఎత్తిపోతల పథకాల పంపు మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశా రు. ఇది ప్రారంభమవుతే గట్టు మీది గ్రామాలకు సాగునీరు అందుతుంది. పంటలు పుష్కలంగా పండి, రైతులు ఆర్థిక పరిపుష్టిని సాధిస్తారు.
ట్రయల్ రన్ లో ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారులు పెంటారెడ్డి, ఇరిగేషన్ CE శ్రీ శ్రీనివాస్,వర్ని,చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇరిగేషన్ అధికారులు,రైతులు ఉన్నారు.




Post a Comment