రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
పోడు భూములు, ఇతర రైతు సంబంధిత సమస్యల పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో నిన్న 17 న హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సమావేశంలో అన్ని కమిషన్ సభ్యులు, గిరిజన రైతు నాయకులు, జిల్లా అధికారులు (ఆర్డీఓ ఎల్లారెడ్డి, ఎఫ్‌డీఓ కామారెడ్డి, ఎస్ఈ ఎన్‌పీడీసీఎల్, డీటిడీఓ) పాల్గొన్నారు.
ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పోడు రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భూ రికార్డుల లోపాలు, సర్వే సమస్యలు, సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రైతులకు సౌకర్యాలు మెరుగుపరచడం, అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓలు nv గిరి, ప్రభాకర్, dtwo, drda, ఫారెస్ట్, ఎలక్ట్రిసిటీ, వ్యవసాయం, తదితర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment