•జనగణన-2027 పూర్తిగా డిజిటల్‌లో నమోదు
•ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన
•పోర్టల్‌లో (http://se.census.gov.in) నమోదు చేసుకోండి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : జనగణన-2027 కార్యక్రమం పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన మాట్లాడారు.
మొదటి దశలో భాగంగా, స్వీయ గణన - సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహించబడుతుంది. పౌరులు తమ స్వీయ గణనను అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.in ద్వారా పూర్తి చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
నమోదు సమయంలో ప్రతి వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య - యూనిక్ ID ఇవ్వబడుతుంది. ఈ IDని గృహ గణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా ఇవ్వాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్ ద్వారా ఎవరైనా సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు.
జిల్లా ప్రజలందరూ నిర్ణీత గడువులోపు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని స్వీయ గణన ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు. ప్రజల భాగస్వామ్యం జిల్లాలో సమర్థవంతమైన ప్రణాళిక మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు.
సేకరించిన సమాచారం మొత్తం కచ్చితంగా గోప్యంగా ఉంచబడుతుంది. జనగణన సమాచారం దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు కీలకం. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు:
కామారెడ్డి జిల్లాలో వేసవి దృష్ట్యా తాగు నీటి వనరుల కోసం ఆయా గ్రామాలలో అవసరం ఉన్నచోట పనుల మంజూరీ కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా గ్రామాలలో గ్రామ పంచాయతీ నిధులు, మండల పరిషత్ నిధులు మరియు జిల్లా పరిషత్ నిధులు ఉపయోగించి ఈ వేసవి కాలంలో నీటి కొరత లేకుండా అవసరం ఉన్న గ్రామాలలో ఈ నిధులు వినియోగించాలని ఆదేశించారు.
జనాభా గణన-2027 స్వీయ గణనను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన జిల్లా కలెక్టర్
ప్రజలందరూ స్వీయ గణనలో పాల్గొనాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
జనాభా గణన-2027లో భాగంగా ప్రారంభమైన "స్వీయ గణన" ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ప్రధాన గణన అధికారి ఆశిష్ సంగ్వాన్ గురువారం IDOC కలెక్టరేట్‌లో తన కుటుంబ వివరాలను స్వయంగా పోర్టల్‌లో నమోదు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా గణన-2027 పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతోందని తెలిపారు. మొదటి దశలో భాగంగా స్వీయ గణన 26-04-2026 నుండి 10-05-2026 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను స్వయంగా వివరాలు నమోదు చేశానని తెలిపారు.
ప్రతి పౌరుడు మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా https://se.census.gov.in� వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగా స్వీయ గణన పూర్తి చేయవచ్చని తెలిపారు. నమోదు అనంతరం ప్రతి వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ ID) వస్తుందని, దానిని భద్రపరచి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు అందజేయాలని సూచించారు.
జిల్లా ప్రజలందరూ మే 10వ తేదీలోపు స్వీయ గణన పూర్తి చేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజలు అందించే సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుందని, భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈ సమాచారం కీలకమని వివరించారు.



Post a Comment