•తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల
•బాలికలదే పైచేయి - రాష్ట్ర వ్యాప్తంగా 95.15% ఉత్తీర్ణత
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె. కేశవరావు విడుదల చేశారు.
ముఖ్యాంశాలు:
మొత్తం ఉత్తీర్ణత: 95.15%
ఉత్తీర్ణులైన విద్యార్థులు: 4,97,312 మంది
బాలికల ఉత్తీర్ణత: 96.25%
బాలుర ఉత్తీర్ణత: 94.07%
అత్యధిక ఉత్తీర్ణత: ములుగు జిల్లా - 99.30%
అత్యల్ప ఉత్తీర్ణత: హైదరాబాద్ జిల్లా - 89.23%
జిల్లాల వారీగా, మీడియం వారీగా:
5,731 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. ఆరు పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. తెలుగు మీడియంలో 89.14%, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10%, ఉర్దూ మీడియంలో 86.71%, ఇంగ్లీష్ మీడియంలో 95.56% ఉత్తీర్ణత సాధించారు.
కేశవరావు అభినందనలు:
10వ తరగతిలో ఉత్తీర్ణులైన బాలబాలికలకు కె. కేశవరావు అభినందనలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పదవ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచిందని అన్నారు. ఆయన తో పాటు ఉన్నత విద్యా శాఖ కమిషనర్ యోగీతా రాణా ఉన్నారు.


జూన్ 5 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు, మే 15 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె. కేశవరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ముఖ్యాంశాలు:
బాలికల ఉత్తీర్ణత 96.25 శాతం, బాలుర ఉత్తీర్ణత 94.07 శాతంగా నమోదైంది. పదవ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30 శాతం, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ప్రభుత్వ పాఠశాలల పనితీరు:
పదో తరగతి ఫలితాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు సత్తా చాటాయి. 2065 జడ్పీ స్కూళ్లలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. జడ్పీ స్కూళ్లలో 93.53 శాతం, మోడల్ స్కూళ్లలో 97.83 శాతం, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా 5,731 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, ఆరు పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి.
మీడియం వారీగా: తెలుగు మీడియంలో 89.14 శాతం, ఉర్దూ మీడియంలో 86.71 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 95.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలుగు మీడియంతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియంలో పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది.
సప్లిమెంటరీ, రీకౌంటింగ్:
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 5వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. రేపటి నుంచి మే 14వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించొచ్చు.
ఫలితాలతో సంతృప్తి చెందని వారి కోసం రేపటి నుంచి మే 15వ తేదీ వరకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు.
వాట్సాప్‌లో టెన్త్ రిజల్ట్స్:
ఈ సారి వాట్సాప్ ద్వారానూ పదో తరగతి ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్‌లో రిజల్ట్స్ చెక్ చేయడం కోసం ముందుగా 8096958096 అనే నంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. తర్వాత దానికి వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపండి. ఆ తర్వాత 'SSC Results' అని టైప్ చేసి మీ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. క్షణాల్లోనే మీ ఫలితాలు కనిపిస్తాయి.
Post a Comment