Collector's Inspection | కలెక్టరేట్ రోడ్డుపై పారిశుధ్యాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్ రహదారి సమీపంలో శానిటేషన్ పరిస్థితులను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో శుభ్రత, చెత్త నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
రోడ్డు పక్కన చెత్త , నీటి నిల్వలు వంటి తదితర వాటిని పరిశీలించి సంబంధిత మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సానిటేషన్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతర శుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా, పట్టణ పరిసరాల్లో పారిశుధ్యాన్ని కచ్చితంగా నిర్వహించడం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. స్వచ్ఛమైన వాతావరణం కోసం అధికారులు సమన్వయము తో కలిసి పనిచేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post