[ఫోటో: పలు కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్న మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి]
👉బాన్సువాడ నియోజకవర్గంలో పరామర్శలు
👉ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురు ఆత్మీయుల కుటుంబాలను మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
👉నసురుల్లాబాద్ మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ శ్రీధర్ గౌడ్ తండ్రి యాదగిరి గౌడ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. నసురుల్లాబాద్‌లోని వారి ఇంటికి వెళ్లిన భాస్కర్ రెడ్డి, యాదగిరి గౌడ్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
👉వర్ని మండలం ఎస్‌ఎన్ పురం ఉప సర్పంచ్ రెడ్డి రాంబాబు కుమారుడు రెడ్డి పృధ్వీ చౌదరి గుండె పోటుతో మరణించడంతో ఎస్‌ఎన్ పురంలోని వారి నివాసానికి వెళ్లి పృధ్వీ చౌదరి చిత్ర పటానికి నివాళులర్పించారు.
👉వర్ని మండలం హుమ్నాపూర్ మాజీ సర్పంచ్ లీలా శంకర్ తండ్రి వీర్రాజు అనారోగ్యంతో మరణించడంతో హుమ్నాపూర్‌లోని వారి ఇంటికి వెళ్లి వీర్రాజు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
👉వర్ని మండలం సైద్పూర్ తండా ఉప సర్పంచ్ రాకేష్ రాథోడ్ తండ్రి, కేఆర్5 న్యూస్ సీఈఓ కిషన్ రాథోడ్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న భాస్కర్ రెడ్డి, త్వరగా పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
👉బాన్సువాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామంలో తన సమీప బంధువు రాజ గంగవ్వ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమాలలో నసురుల్లాబాద్, వర్ని, బాన్సువాడ గ్రామీణ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు.




Post a Comment