Haj Piligrims | బాన్సువాడలో హజ్ యాత్రికులకు శిక్షణ

 

•బాన్సువాడలో హజ్ యాత్రికులకు శిక్షణ  

•అయేషా మసీదులో ఘనంగా వీడ్కోలు 

•కాబాలో ఒక్క నమాజు చేస్తే లక్ష నమాజులతో సమానం : హాఫిజ్ ఈసా

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మసీదు-ఎ-ఆయిషా సిద్దీఖాలో  హజ్-2026 యాత్రికుల కోసం శిక్షణా తరగతులు, వీడ్కోలు సమావేశం భక్తి శ్రద్ధలతో జరిగాయి.  (వీడియో 👇)




మౌలానా ఈసా సిద్దిఖీ ఆధ్వర్యంలో మార్గదర్శకం

మదర్సా ఫైజుల్ ఉలూమ్ నాజిమ్, మసీదు ఖతీబ్ మౌలానా సయ్యద్ ఈసా సిద్దిఖీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హజ్‌కు వెళ్తున్న యాత్రికులకు పూలమాలలు వేసి, శాలువాలతో సన్మానించి వీడ్కోలు పలికారు.  

ఈ సందర్భంగా మౌలానా  హజ్ చేసే పద్దతి పై శిక్షణ ఇచ్చారు. "కాబా షరీఫ్‌లో ఒక నమాజ్ చేస్తే లక్ష నమాజుల పుణ్యం, మదీనాలో 50 వేల నమాజుల పుణ్యం లభిస్తుంది. అరాఫాత్, మినా మైదానాల్లో గడిపే రోజులు చాలా విలువైనవి. రౌజా-ఎ-అక్దస్‌పై దరూద్-ఓ-సలాం పంపి, ఉమ్మత్-ఎ-ముస్లిమా కోసం ప్రత్యేకంగా దుఆ చేయాలి" అని సూచించారు.  

"అల్లాహ్ తాల ప్రతి హాజీ దుఆను మొదటి చూపులోనే స్వీకరిస్తాడు. తప్పిన నమాజులకు ప్రాయశ్చిత్తం చేసుకుని, హృదయపూర్వకంగా క్షమాపణ కోరండి" అని పిలుపునిచ్చారు.  

హజ్ యాత్రికులు & ప్రముఖులు  

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ ఖాలిఖ్,  హజ్ కమిటీ సభ్యులు  అల్తమష్, ముఖీద్,  సయ్యద్ అల్-హుదా, ఇబ్రహీం, ఇర్ఫాన్, సలీం, అబ్దుల్ అజీజ్, ఆబిద్, కాజిమ్, ఆజం, అహ్మద్ తదితర హజ్ యాత్రికులు పాల్గొన్నారు.  

సోషల్ సర్వీస్ కమిటీ కామారెడ్డి జనరల్ సెక్రటరీ మహ్మద్ అతీక్, కౌన్సిలర్లు మహ్మద్ ఖాలిఖ్, మహ్మద్ ఖలీల్, మహ్మద్ సలీమ్, సయ్యద్ యూనస్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.  

"హజ్ యాత్రికులందరూ క్షేమంగా వెళ్లి, హజ్-ఎ-మబ్రూర్‌తో తిరిగి రావాలి. అల్లాహ్ వారి హజ్‌ను కబూల్ చేయాలి" అని మౌలానా ఈసా సిద్దిఖీ సామూహిక దుఆ చేశారు. పెద్ద సంఖ్యలో ముసల్లీలు, యాత్రికుల కుటుంబ సభ్యులు భావోద్వేగంతో పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post