Ramadugu | ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

 

అంబేద్కర్ జయంతి సందర్బంగా గ్రామస్తులతో కలిసి వేడుకలు నిర్వహిస్తున్న ఎస్సై ఎల్. రామ్

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్ రూరల్:

సిరికొండ మండలం రామడుగు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై ఎల్.రామ్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సమాజంలో సమానత్వం, విద్య మరియు హక్కుల కోసం ఆయన చేసిన  కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, రాజ్యాంగ నిర్మాతకు తమ హృదయపూర్వక నివాళులు అర్పించారు.

Post a Comment

Previous Post Next Post