మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ
సత్తా చాటిన TGMREIS విద్యార్థులు
SSC ఫలితాల్లో రాష్ట్రంలో 98% ఉత్తీర్ణత
తెలంగాణ డైలీ న్యూస్,హైదరాబాద్: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ TGMREIS పాఠశాలలు 2026 SSC పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించాయి. మొత్తం 98 శాతం ఉత్తీర్ణతతో విద్యా ప్రమాణాల్లో తమ సత్తా చాటాయి.
ఏప్రిల్ 29న TGMREIS కార్యదర్శి బి. షఫీఉల్లా, IFS విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఏడాది ఫలితాల్లో 204 పాఠశాలలకు గాను 126 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషికి నిదర్శనమని ఆయన తెలిపారు.
*ముఖ్యాంశాలు:*
1. మొత్తం ఉత్తీర్ణత శాతం: 98%
2. 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు: 204కు 126
3. 500 మార్కులకు పైగా సగటు సాధించిన పాఠశాలలు: 197
4. 570 మార్కులకు పైగా సగటు సాధించిన పాఠశాలలు: 45
రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డికి తల్లిదండ్రులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, TGMREIS వైస్ ఛైర్మన్ & ప్రెసిడెంట్ శ్రీ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. అన్ని సంస్థల్లో ఉన్నత విద్యా ప్రమాణాలను కొనసాగించడానికి సమిష్టి కృషి దోహదపడిందని వారు ప్రశంసించారు.
TGMREIS పాఠశాలలు గత కొన్నేళ్లుగా SSC ఫలితాల్లో వరుసగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. గుణాత్మక రెసిడెన్షియల్ విద్యతో మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి.
కుత్బుల్లాపూర్ TGMREIS పాఠశాల విద్యార్థిని జి. మౌన్య శ్రీ 591 మార్కులు సాధించి రాష్ట్రవ్యాప్తంగా TGMREIS పాఠశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విద్యార్థి మొహమ్మద్ రెహాన్, సంగారెడ్డి విద్యార్థి ఎం. పూజిత్ చెరో 589 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
*టాప్ 10 విద్యార్థుల జాబితా:*
1. జి. మౌన్య శ్రీ - కుత్బుల్లాపూర్ G-1 - 591 మార్కులు
2. మొహమ్మద్ రెహాన్ - సికింద్రాబాద్ కంటోన్మెంట్ B-1 - 589 మార్కులు
3. ఎం. పూజిత్ - సంగారెడ్డి B-1 - 589 మార్కులు
4. మొహమ్మద్ రెహాన్ - సంగారెడ్డి B-1 - 587 మార్కులు
5. పఠాన్ రెహానా - కోదాడ G-1 - 585 మార్కులు
6. డి. అనస్ అలీ - సంగారెడ్డి B-1 - 584 మార్కులు
7. సింఘం శ్రీజ - హయత్‌నగర్ G-1 - 584 మార్కులు
8. మొహమ్మద్ ఉమ్మయ తరన్నుమ్ - ధర్మపురి G-1 - 583 మార్కులు
9. మైమూనా మదీహా - మక్తల్ G-1 - 583 మార్కులు
10. టి. తరుణ్ కుమార్ - పటాన్‌చెరు B-1 - 583 మార్కులు
TGMREIS వైస్ ఛైర్మన్ & ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ ఖురేషి మాట్లాడుతూ ఈ అసాధారణ ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, అకడమిక్ టీమ్, సహాయక సిబ్బంది సమిష్టి కృషి ఫలితమేనని కొనియాడారు.
నిరంతర అకడమిక్ మానిటరింగ్, ఫోకస్డ్ మెంటరింగ్, విద్యార్థి కేంద్రీకృత విధానం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. రెమిడియల్ క్లాసులు, పరీక్ష ఆధారిత శిక్షణ, మానసిక ఆరోగ్య మద్దతు కార్యక్రమాలు విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని ఆయన కోరారు. మైనారిటీ వర్గాల విద్యార్థుల ప్రతిభను వెలికితీసి నాణ్యమైన విద్య అందించి ఉన్నత శిఖరాలకు చేర్చడమే TGMREIS లక్ష్యమని స్పష్టం చేశారు.
.jpeg)


Post a Comment