జర్నలిస్టుల బస్ పాస్‌ల గడువు జూన్ 16 వరకు పొడిగింపు
అక్రిడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్తింపు
టీజీఎస్ఆర్టీసీ ఎండీకి ఐ&పీఆర్ శాఖ ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు జారీ చేసిన బస్ పాస్‌ల గడువును 2026 జూన్ 16 వరకు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐ&పీఆర్ శాఖ స్పెషల్ కమిషనర్ జి. ముకుందా రెడ్డి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.
29.05.2026 తేదీతో జారీ అయిన లెటర్ నం. 003491/MR/2024లో, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర, జిల్లా జర్నలిస్ట్ బస్ పాస్‌ల వాలిడిటీని ముందుగా ఒక నెల పాటు 31.05.2026 వరకు పొడిగించారు. తాజాగా అక్రిడిటేషన్ కార్డుల గడువుతో పాటు బస్ పాస్‌ల గడువును కూడా 16.06.2026 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అక్రిడిటేషన్ కార్డుల వాలిడిటీని పరిగణలోకి తీసుకోకుండా అన్ని రాష్ట్ర, జిల్లా జర్నలిస్ట్ బస్ పాస్‌లను 16.06.2026 వరకు అనుమతించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీని ఐ&పీఆర్ శాఖ కోరింది.
ఈ ఉత్తర్వుల ప్రతులను మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్, మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీపీఆర్ఓలకు సమాచారం, తదుపరి చర్యల నిమిత్తం పంపించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు ఊరట లభించినట్లయింది.
కాగా కామారెడ్డి జిల్లా లో 2026-28 సంవత్సరానికి గాను కొత్త అక్రిడీటేషన్ కార్డుల జారీ ప్రారంభమైందని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 271 కార్డులను పంపిణి చేసినట్లు అక్రిడీటేషన్ కమిటీ సభ్యుడు, TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన అర్హులైన జర్నలిస్ట్ లకు కార్డులు అందజేస్తారని తెలిపారు.


Post a Comment