Applications Invited | అత్యుత్తమ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అత్యుత్తమ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం  

2026-27 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగులకు అవకాశం  

10వ తరగతిలో 400పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు అర్హులు  

ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:  

2026-27 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు అత్యుత్తమ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.వెంకటేష్ ఒక ప్రకటనలో కోరారు. 

మార్చి 2026లో 10వ తరగతి పరీక్షల్లో 400 పైగా మార్కులు పొందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని తెలిపారు. 

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 20-05-2026 నుంచి 05-06-2026 వరకు https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన పిదప ఈ-పాస్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఆటోమేటిక్‌గా జరుగుతుందని, కళాశాలలు అలాట్ చేస్తారని జిల్లా అధికారి పి.వెంకటేష్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత పత్రములు జతచేయాలని కోరారు.

==========================

కామారెడ్డిలో రేపు జాబ్ మేళా  

వరుణ్ మోటార్స్‌లో పలు ఉద్యోగాలు: కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు  

డిగ్రీ, డిప్లొమా అర్హత: జీతం రూ.13,000 నుంచి రూ.25,000+  

ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు  

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు గురువారం, 21-05-2026న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. కిరణ్ కుమార్ తెలిపారు. 

కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో గల రూమ్ నెం. 121లో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 

కామారెడ్డిలోని ప్రముఖ సంస్థ వరుణ్ మోటార్స్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ అడ్వైజర్, బాడీషాప్ మేనేజర్, అకౌంటెంట్/క్యాషియర్ పోస్టులకు ఉద్యోగాలు కలవు. 

అర్హత: ఏదైనా డిగ్రీ లేదా మెకానికల్ డిప్లొమా. వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. జీతం రూ.13,000, రూ.14,000, రూ.15,000, రూ.25,000+ తో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సెంటివ్స్ ఉంటాయి. 

ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు 2 సెట్లు, ఆధార్ కార్డు ఫొటో కాపీలతో హాజరు కావాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాలకు 9502176513, 6305743423 నంబర్లలో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సూచించారు.

Post a Comment

أحدث أقدم