Husband Missing | భర్త కనిపించడం లేదు: పోలీసులకు భార్య ఫిర్యాదు

భర్త కనిపించడం లేదు: పోలీసులకు భార్య ఫిర్యాదు  

ఈ నెల 2 నుంచి ఆచూకీ లేదని వినతి  

ఫోన్ చేసినా స్పందన లేదు, చివరికి స్విచ్ఛాఫ్ 

మిస్సింగ్ కేసు నమోదు, దర్యాప్తుకు ఆదేశాలు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:  

తన భర్త కనిపించడం లేదని బాన్సువాడ గౌలిగూడకు చెందిన సమీరా బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

సమీరా బేగం భర్త షేక్ హుస్సేన్, వయసు 35 సంవత్సరాలు. అతను 02-05-2026 రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి 11 గంటలకు భర్త ఫోన్ నంబర్  నుంచి భార్యకు ఫోన్ వచ్చిందని, నేను హౌసింగ్ బోర్డు కాలనీ, కాటేదాన్, హైదరాబాద్ దగ్గర ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడని తెలిపారు. 

మరుసటి రోజు 03-05-2026న మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని, 06-05-2026 రోజు కూడా ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి భర్త ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని, ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

భర్త పొడవు 5 అడుగులు, సన్నగా ఉంటాడని, ఎరుపు టీ షర్టు, యాష్ కలర్ షార్ట్ ధరించి, గడ్డం పెంచి ఉన్నాడని ఫిర్యాదులో వివరించారు. తన భర్త ఆచూకీ తెలిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఫిర్యాదు అందుకున్న పోలీసులు //Cr.No. 502/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం ఎస్ఐ రవీందర్ రెడ్డికి అప్పగించారు.

ఫిర్యాదుదారు: సమీరా బేగం, వయసు 30, గృహిణి, గౌలిగూడ, బాన్సువాడ.  

ఫోన్ నంబర్లు: 9908378715

Post a Comment

Previous Post Next Post