Accident on NH-44 | ఎన్‌హెచ్-44పై ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్‌హెచ్-44పై ఘోర రోడ్డు ప్రమాదం  

నిజామాబాద్ జిల్లాలో 7 కార్లు, 3 లారీలు ఢీ, పలువురికి గాయాలు  

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ద జాతీయ రహదారి 44పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  

టైరు పేలి లారీ సడన్‌గా ఆగడంతో ప్రమాదం  

లారీ టైరు పేలి ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోవడంతో వెనుక వస్తున్న వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. 7 కార్లు, 3 లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  

రోడ్డు పక్కకు పడిపోయిన వాహనాలు  

ప్రమాద తీవ్రతకు కొన్ని వాహనాలు రోడ్డు పక్కకు పడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు, పోలీసులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  

ప్రాణనష్టం లేదు: పోలీసులు  

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.






Note : వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయగలరు.

Post a Comment

Previous Post Next Post