ACB RAID | నర్సాపూర్ విద్యుత్ ఏడీ ఏసీబీకి చిక్కారు



నర్సాపూర్ విద్యుత్ ఏడీ ఏసీబీకి చిక్కారు  

రూ.25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రమణారెడ్డి  

ఏసీబీ అధికారుల దాడులతో కలకలం  



తెలంగాణ డైలీ న్యూస్, మెదక్:  

మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీ రమణారెడ్డి ఏసీబీ వలలో చిక్కారు. 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఓ పని కోసం లంచం డిమాండ్ చేశారని బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది. 

రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిన ఉంది.

Post a Comment

Previous Post Next Post