అమర్నాథ్ యాత్రికులకు అన్నదాన సేవలు
సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి బృందం ప్రయాణం
మూడు ప్రధాన కేంద్రాల్లో ఉచిత అన్నప్రసాద వితరణ
సిద్దిపేట, దాస శ్రీనివాస్-తెలంగాణ డైలీ న్యూస్:
అమర్నాథ్ క్షేత్రానికి వెళ్లే శివభక్తులకు నిరంతర అన్నదాన సేవలు అందించడానికి సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్ధమైంది. ఇందులో భాగంగా సేవలందించేందుకు సమితి ప్రతినిధుల మొదటి విడత బృందం శంషాబాద్ విమానాశ్రయం నుండి అమర్నాథ్ బయలుదేరి వెళ్లింది.
మొదటి విడతగా బయలుదేరిన వారిలో సమితి చైర్మన్ చీకోటి మధుసూదన్, గౌరవ అధ్యక్షుడు కాచం కాశినాథ్, ప్రధాన కార్యదర్శి డా. మాంకాల నవీన్ కుమార్, సహాయ కార్యదర్శి చింత శ్రీనివాస్, పీ.ఆర్.ఓ పోశెట్టి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
మూడు ప్రధాన కేంద్రాల్లో అన్నప్రసాద వితరణ
ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రికులకు విస్తృతమైన సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం మూడు ముఖ్య ప్రాంతాలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలను లంగర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
1. బాల్తాల్ బేస్ క్యాంప్: లంగర్ నంబర్ 8
2. పంచతరణి: లంగర్ నంబర్ 2
3. అమర్నాథ్ మంచు లింగం క్షేత్రం సమీపంలో
అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు, యాత్రికులు ఈ అన్నదాన సేవలను ఉచితంగా వినియోగించుకోవాలని సమితి ప్రతినిధులు కోరారు.
సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
యాత్రలో ఉన్న భక్తులు సమితి సేవలు మరియు లంగర్ల వివరాలను తెలుసుకోవడానికి కింద పేర్కొన్న నంబర్లలో సంప్రదించవచ్చు.
- 7382095111
- 7382095222
భక్తులందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకొని, తమ అమర్నాథ్ యాత్రను విజయవంతం చేసుకోవాలని సమితి నిర్వాహకులు కోరారు.

إرسال تعليق