కామారెడ్డిలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: కలెక్టర్
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా చూడాలని తెలిపారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాల సేవలను సద్వినియోగం చేసుకొని అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



إرسال تعليق