Top News

Dogs Bite to Girl | బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి  

మదీనా కాలనీలో ఘటన 

బాలికకు తీవ్ర గాయాలు - నిజామాబాద్‌కు తరలింపు

పట్టణంలో  రెచ్చిపోతున్న వీధి కుక్కలు 

బాన్సువాడ, జూలై 29: బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో బాలికకు ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రి అయిన అబ్దుల్ రెహమాన్ తో కలిసి మార్కెట్ కు వెళ్లేందుకు సిద్ధమైన బాలిక, ఇంటి నుంచి బయటకు రాగా, అదే సమయంలో కుక్కలు ఒక్కసారి గా దాడి చేశాయి.(వీడియో 👇)


చిన్నారి ఏడుపు విన్న తండ్రి, స్థానికులు 
వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను తరిమికొట్టి బాలికను రక్షించారు. రక్తస్రావం అవుతున్న చిన్నారిని వెంటనే 108 ద్వారా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం చిన్నారిని నిజామాబాద్‌లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో మదీనా కాలనీతో పాటు బాన్సువాడ పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో వీధి కుక్కల బెడద పెరిగిపోతుందని, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని, వీధి కుక్కలు కనిపిస్తే దూరంగా ఉండాలని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు.





Post a Comment

أحدث أقدم