జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
నడవలేని స్థితిలో ఉన్న ఫిర్యాదుదారుడి వద్దకు స్వయంగా వెళ్లి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సోమవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్యే, సోమవారం ఎస్పీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు.
ఫిర్యాదుదారుడికి ఎస్పీ భరోసా
అదే సమయంలో ఫిర్యాదుదారుడు ఒకరు నడవలేని స్థితిలో జిల్లా పోలీస్ కార్యాలయ రిసెప్షన్ వద్ద కూర్చుని ఉండడాన్ని జిల్లా ఎస్పీ గమనించారు. వెంటనే స్వయంగా వారి దగ్గరకు వెళ్లి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదును స్వీకరించి, సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని, ఫిర్యాదుదారుల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.


إرسال تعليق