సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి: పోచారం శ్రీనివాస రెడ్డి
ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం
ముంపు భూములకు రూ.55.30 కోట్ల పరిహారం మంజూరు
హైదరాబాద్, తెలంగాణ డైలీ న్యూస్:
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి ఇరిగేషన్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీ జనరల్ రమేష్, ఈఎన్‌సీ అడ్మిన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా గత నెల 23 మే 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ. 55.30 కోట్లను మంజూరు చేస్తూ జి.ఓ. నం. 37 ద్వారా 08 జూన్ 2026న ఉత్తర్వులు జారీ అయ్యాయి. (సమీక్ష వీడియో 👇)
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను పోచారం శ్రీనివాస రెడ్డి ఆదేశించారు.


إرسال تعليق