Top News

PBR Visits | బోర్లం, సోమేశ్వర్‌లో పలు కుటుంబాలను పరామర్శించిన పోచారం భాస్కర్ రెడ్డి


బోర్లం, సోమేశ్వర్‌లో పలు కుటుంబాలను పరామర్శించిన పోచారం భాస్కర్ రెడ్డి  

మృతుల చిత్రపటాలకు పుష్పాంజలి.. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

బాన్సువాడ మండల నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటన

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 13: బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం, సోమేశ్వర్ గ్రామాలలో ఇటీవల మృతి చెందిన పలువురు ప్రముఖుల కుటుంబాలను మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శనివారం పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

బోర్లం గ్రామంలో పరామర్శలు 

బోర్లం గ్రామంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ గోపాన్‌పల్లి సాయిలు మాతృమూర్తి రామవ్వ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి ఇంటికి వెళ్లిన భాస్కర్ రెడ్డి రామవ్వ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

గ్రామ మాజీ ఉప సర్పంచ్ మమ్మయి కాశీరాం మాతృమూర్తి ఎల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి ఎల్లవ్వ చిత్ర పటానికి నివాళులర్పించారు.

NDCCB బాన్సువాడ బ్యాంక్ అటెండర్ సింగరి సతీష్ నానమ్మ నాగవ్వ మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి నాగవ్వ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి సంతాపం తెలిపారు.








సోమేశ్వర్‌లో నివాళులు

సోమేశ్వర్ గ్రామ మాజీ సర్పంచ్ మొగులయ్య, బాన్సువాడ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నాయిని గంగారాం తండ్రి నాయిని హన్మండ్లు అనారోగ్యంతో మరణించడంతో వారి ఇంటికి వెళ్లి హన్మండ్లు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

సోమేశ్వర్ గ్రామ మాజీ సర్పంచ్ గంగారాం తండ్రి బీమా కిష్టయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి బీమా కిష్టయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమాలలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల నాయకులు మోహన్ నాయక్, నార్ల సురేష్, శ్రీనివాస్ రెడ్డి, జలీల్, ఇతర ప్రజాప్రతినిధులు పోచారం భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post