Top News

Police Help | పోలీస్ అంటే మానవత్వం.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కానిస్టేబుల్

అంత్యక్రియలకు ఆర్థిక సాయం  

పోలీస్ అంటే మానవత్వం.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కానిస్టేబుల్

మృతుని కుటుంబానికి రూ.5వేలు అందించిన జుక్కల్ కానిస్టేబుల్ శ్రీను నాయక్

తెలంగాణ డైలీ న్యూస్, మాచారెడ్డి: పోలీస్ అంటేనే ధైర్యం. ఏ ఆపద వచ్చినా మొదటగా గుర్తుకు వచ్చేది పోలీసులే. ఆ పోలీసులకు మానవత్వం తోడైతే ఏ పేదవాడికీ కన్నీరు ఉండదని చెప్పేందుకు జుక్కల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ శ్రీను నాయక్ నిదర్శనంగా నిలిచారు.

అంత్యక్రియలకు కూడా లేని పరిస్థితి 

మాచారెడ్డి మండలం ఎల్లంపేట పక్క గ్రామం పందిమడుగు తాండకు చెందిన భూక్యా శ్రీను మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

విషయం తెలిసి సాయం చేసిన కానిస్టేబుల్  

విషయం తెలుసుకున్న ఎల్లంపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శ్రీను నాయక్ వెంటనే స్పందించారు. అంత్యక్రియలకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి కొండంత మనోధైర్యాన్ని ఇచ్చారు.

'నేనున్నా' అంటూ భరోసా 

మృతి చెందిన శ్రీను భార్య జున్ను, ఇద్దరు కుమారులైన మహేందర్, వీరేందర్‌లకు 'నేనున్నా' అంటూ భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన కానిస్టేబుల్ శ్రీను నాయక్‌ను స్థానిక నాయకులు, గ్రామస్తులు అభినందించారు. పోలీస్ అంటే శాంతిభద్రతలే కాదు, మానవత్వానికి మారుపేరని శ్రీను నాయక్ నిరూపించారని ప్రశంసించారు.

Post a Comment

Previous Post Next Post