Top News

SC, ST Journalist Arrest | తెల్లవారుజామున ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల అరెస్ట్

అక్రిడిటేషన్ కార్డుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి యత్నం

తెల్లవారుజామున ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

కామారెడ్డి జిల్లా కేంద్రంలో, బాన్సువాడలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అక్రిడిటేషన్ కార్డుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు తలపెట్టిన ఐ అండ్ పీఆర్ కమిషనరేట్ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.  

జిల్లా నాయకులను పోలీసులు ఇళ్ల వద్దకు వెళ్లి తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను జర్నలిస్టులు ఖండించారు.  ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ముట్టడికి వెళ్తున్న జర్నలిస్టులను హౌస్ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం సరికాదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న శాంతియుత నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు.  

జిల్లా వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేసిన జర్నలిస్టులందరినీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేయకుండా, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.  

అరెస్టైన వారిలో జిల్లా అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెడ్డు సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాండ్ల రాజు, జిల్లా ప్రచార కార్యదర్శి బాలాజీ, ఆశన్న, సంజీవులు, బాబూరావు, కిసరి రాజు, బాన్సవాడలో పోషీరామ్  ఉన్నారు.

Post a Comment

أحدث أقدم