బీర్కూర్‌లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
3 తులాల బంగారం, 13 తులాల వెండి, రూ.1.20 లక్షల నగదు చోరీ.. కేసు నమోదు
వరుస చో్రీలతో ఆందోళనలో ప్రజలు
తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు.
ఘటన వివరాలు
బీర్కూర్‌కు చెందిన వడ్ల రాజు కొత్త ఇల్లు నిర్మించుకుంటూ ప్రస్తుతం కిరాయింట్లో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 3 తులాల బంగారం, 13 తులాల వెండి ఆభరణాలు, లక్ష ఇరవై వేల రూపాయల నగదు కనిపించలేదు.
పోలీసులకు ఫిర్యాదు
చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితుడు వడ్ల రాజు వెంటనే బీర్కూర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
గతంలో కూడా బీర్కూర్ పరిసర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
దర్యాప్తు ప్రారంభం
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.






Post a Comment