Anganwadi Recruitment | అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ధృవపత్రాల పరిశీలన

బాన్సువాడ ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ధృవపత్రాల పరిశీలన  

28 నుండి 01 వరకు మండలాల వారీగా షెడ్యూల్ విడుదల  

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలి

బాన్సువాడ : తెలంగాణ ప్రభుత్వం, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు, బాన్స్వాడ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్(ST ఏరియా) పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు.

ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 09.07.2026 నుండి 25.07.2026 వరకు జరిగింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని 28.07.2026 నుండి 01.08.2026 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

మండలాల వారీగా ధృవపత్రాల పరిశీలన షెడ్యూల్

అభ్యర్థులు తమకు సంబంధించిన మండలం తేదీన ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు హాజరు కావాల్సి ఉంటుంది.

1. బాన్స్వాడ మండలం - 28.07.2026  

2. బిర్కూర్ మండలం - 29.07.2026  

3. నస్రుల్లాబాద్ మండలం - 30.07.2026  

4. నిజాంసాగర్ మరియు ముహమ్మద్ నగర్ మండలాలు - 31.07.2026  

5. పిట్లం మండలం - 01.08.2026  

పై సూచించిన తేదీల ప్రకారం అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు.

తప్పనిసరిగా తీసుకురావాల్సిన ధృవపత్రాలు:

ధృవపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలతో పాటు, అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు 2 సెట్లు తీసుకురావాలి. అవి:

1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణ పత్రము - SSC సర్టిఫికెట్

2. కుల ధృవీకరణ పత్రము - తహసీల్దార్ జారీ చేసినది

3. విద్యార్హత ధృవీకరణ పత్రము - ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ విద్య అర్హత మార్కుల జాబితా

4. నివాస ధృవీకరణ పత్రము - తహసీల్దార్ జారీ చేసినది

5. దివ్యాంగులు అయిన వారు సదరం సర్టిఫికెట్

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రము

7. ఆనాథ అయితే ఆనాథ సర్టిఫికెట్

8. ఓటర్ ఐ.డి కార్డ్

9. ఆధార్ కార్డ్

ముఖ్య గమనిక

పై తేదీలలో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థుల దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోబడదని అధికారులు స్పష్టం చేశారు. కావున అర్హులైన అభ్యర్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత తేదీన, సమయానికి హాజరు కావాలని కోరారు.

Post a Comment

أحدث أقدم