Top News

Anganwadi | కొయ్యగుట్ట అంగన్‌వాడీలో విద్యార్థులకు కొత్త యూనిఫాం పంపిణీ

 కొయ్యగుట్ట అంగన్‌వాడీలో విద్యార్థులకు కొత్త యూనిఫాం పంపిణీ  

పోషణతో కూడిన ఆహారం అందించిన 3వ వార్డు కౌన్సిలర్ హకీమ్  

అంగన్‌వాడీ బాలవాటికలో పిల్లలను చేర్పించాలని సూచన  

గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ ద్వారా పోషకాహారం  

బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:  

బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు పరిధిలోని కొయ్యగుట్ట ప్రభుత్వ ఐసీడీఎస్ బాలవాటిక అంగన్‌వాడీ స్కూల్‌లో విద్యార్థులకు కొత్త స్కూల్ యూనిఫాం, పోషణతో కూడిన ఆహారం అందించారు. 3వ వార్డు కౌన్సిలర్ ఏం ఏయే హకీమ్, స్కూల్ టీచర్ ఇమ్రానా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.  

ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ హకీమ్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల పిల్లలకు చదువుతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా రోజూ అందిస్తోందని తెలిపారు. కావున ప్రజలు తమ పిల్లలను అంగన్‌వాడీ బాలవాటికలో చేర్పించాలని కోరారు.  

గర్భిణీ స్త్రీలు మరియు బాలింత మహిళలకు ఐసీడీఎస్ సెంటర్ల నుంచి వారికి కావలసిన పోషకాహారం అందిస్తున్నారని, ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

ఈ కార్యక్రమంలో కోయగుట్ట మహిళలు  విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم