Top News

Exise | కామారెడ్డిని గంజాయి రహిత జిల్లాగా తీర్చిద్దుతాం

కామారెడ్డిని గంజాయి రహిత జిల్లాగా తీర్చిద్దుతాం

అక్రమ మద్యం, కల్తీ కల్లుపై ఉక్కుపాదం

ఎక్సైజ్ అధికారి బి. ముకుంద రెడ్డి

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి బి. ముకుంద రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో యువత గంజాయి బారిన పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు.

విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో గంజాయి, డ్రగ్స్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని కోరారు.

అక్రమ మద్యం, కల్తీ కల్లుపై ఉక్కుపాదం

అక్రమ మద్యం, కల్తీ కల్లు వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ వ్యాపారాలకు సహకరించే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణ శివారులోని కిరాణా షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదుపై ప్రత్యేక టీం ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.

మద్యం సిట్టింగ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, త్వరలో దాబాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఎవరైనా గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం గురించి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

أحدث أقدم