Graveyard Cleaning | బాన్సువాడ ఖబ్రస్తాన్ లో శుభ్రత పనులు

బాన్సువాడ ఖబ్రస్తాన్ లో శుభ్రత పనులు 

కౌన్సిలర్ ఎం.ఏ.హకీమ్ ప్రత్యేక చొరవ

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ప్రసిద్ధ హజ్రత్ నెక్ బీబీ సాహెబా దర్గా ఆవరణలో ఉన్న స్మశానవాటిక - ఖబ్రస్తాన్ లో వర్షాకాలం కారణంగా చెట్లు, పొదలు విపరీతంగా పెరిగాయి. 

దీంతో ప్రతిరోజు, ప్రతి శుక్రవారం ఖబ్రస్తాన్ ను సందర్శించే ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బాన్సువాడ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ ఎం.ఏ.హకీమ్  దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు.

కౌన్సిలర్ హకీమ్  ప్రత్యేక శ్రద్ధతో ఖబ్రస్తాన్ ఆవరణలో గడ్డి మందు పిచికారి చేయించారు. అలాగే ఖబ్రస్తాన్ గ్రౌండ్ మొత్తాన్ని శుభ్రం చేసే పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎం.ఏ.హకీమ్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖబ్రస్తాన్ ను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని అన్నారు.




Post a Comment

أحدث أقدم