బాన్సువాడ గవర్నమెంట్ హై స్కూల్ లో సమగ్ర శిక్ష సోషల్ ఆడిట్
పాఠశాల నిధులు, వసతులు, సేవలపై చర్చ
బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న సమగ్ర శిక్ష సోషల్ ఆడిట్ కార్యక్రమం ఈరోజు బాన్సువాడ గవర్నమెంట్ హై స్కూల్ లో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో ప్రభుత్వం పాఠశాలలకు కేటాయించిన నిధులు ఎలా ఖర్చు అవుతున్నాయి, మౌలిక వసతుల పరిస్థితి, విద్యార్థులకు అందుతున్న సేవలు నాణ్యతగా ఉన్నాయా అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సోషల్ ఆడిట్ పర్యవేక్షకురాలు సీతక్క మమత మాట్లాడుతూ, పారదర్శకతతో నిధుల వినియోగాన్ని సమీక్షించడం, పాఠశాలలోని సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ఈ ఆడిట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్క నరహరి, వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీక్, కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, సుల్తానా గౌస్, అర్ఫాత్, మేరూ భార్గవ్ తో పాటు పేరెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

إرسال تعليق