Top News

KMR Muncipal Floor Leader | కామారెడ్డి బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా మోటూరి శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా మోటూరి శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక  

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం  

16 మంది బీజేపీ కౌన్సిలర్ల సమక్షంలో నిర్ణయం  

ప్రజా సమస్యల పరిష్కారానికి, పట్టణ అభివృద్ధికి గళం విప్పుతా  

బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: మోటూరి శ్రీకాంత్  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

కామారెడ్డి పట్టణ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా 39వ వార్డు కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

కామారెడ్డి శాసన సభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణానికి చెందిన 16 మంది బీజేపీ కౌన్సిలర్లు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాంత్‌ను ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు.  

ఈ సందర్భంగా మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా రెండవ సారి అవకాశం ఇచ్చిన కామారెడ్డి శాసన సభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి, తోటి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.  

తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్‌లో ప్రజల పక్షాన, కామారెడ్డి పట్టణ అభివృద్ధికి, సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతానని అన్నారు.  

అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పటిష్టతకు తోటి కౌన్సిలర్లతో కలిసి బూత్ స్థాయిలో పని చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని తెలిపారు.

Post a Comment

أحدث أقدم