Top News

Minister Ponnam | ఎత్తోండ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ విష్కరణ

ఎత్తోండ శ్రీ రేణుక ఎల్లమ్మ  ఆలయంలో విగ్రహ విష్కరణ  

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు  

రైతు భరోసా, మహిళా సంక్షేమ పథకాలపై ప్రస్తావన  

వర్షాలు కురిసి పంటలు కళకళలాడాలని ప్రార్థన  

కోటగిరి, తెలంగాణ డైలీ న్యూస్:  

కోటగిరి మండలం ఎత్తోండ    శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయంలో విగ్రహ విష్కరణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.  

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా, పథకాలు అందిస్తూ, మరోవైపు మహిళలను కోటీశ్వరులుగా చేయడానికి వడ్డీ లేని రుణాలు అందిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.  

ఈ వానాకాలం సీజన్‌లో పుష్కలంగా వర్షాలు కురిసి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పచ్చని పంటలతో పంటలు కళకళలాడాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

కాగా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రేణుకా పరంజ్యోతి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవము, జమదగ్ని సమేత రేణుకా దేవి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు గారు, కామారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.









Post a Comment

أحدث أقدم