బుడిమి గ్రామంలో సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ: ఆషాఢ మాసం సందర్భంగా బాన్సువాడ గ్రామీణ మండలం బుడిమి గ్రామంలోని హరిహర దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
హరిహర దేవతలను దర్శించుకున్న అనంతరం శ్రీ శ్రీ శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి సమక్షంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.
కుంకుమార్చనలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.




Good Information
ردحذفإرسال تعليق