Top News

Spot Admissions | 27 న గిరిజన గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు

 

27 న గిరిజన గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు

5 నుండి 9 తరగతుల్లో  - ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీలు

రీజినల్ కో ఆర్డినేటర్ ఎన్.గంగారామ్ నాయక్

మెదక్/ కామారెడ్డి/ నిజామాబాద్ : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల్లోని ఖాళీల భర్తీ కోసం ఈ నెల 27 న స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఆ సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ ఎన్.గంగారామ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఆ రోజు స్పాట్ కౌన్సిలింగ్ కు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. విద్యార్థులు అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని కౌన్సిలింగ్ కు హాజరు కావాలన్నారు. గురుకులం సెట్ రాసిన విద్యార్థులకు తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. అలాగే ఇతర గురుకులాల నుండి గిరిజన సంక్షేమ గురుకులాల్లో చేరే విద్యార్థులకు కూడా ప్రాధాన్యతా క్రమంలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. 

కామారెడ్డిలో..

ఉమ్మడి నిజామాబాద్ లోని నాగిరెడ్డిపేట, బాన్సువాడ, చీమన్ పల్లి గిరిజన సంక్షేమ బాలుర గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరంపల్లి కొనసాగుతున్న నాగిరెడ్డిపేట పాఠశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివరాల కోసం నాగిరెడ్డిపేట ప్రిన్సిపల్ ను సంప్రదించాలన్నారు. 

ఎల్లారెడ్డిలో..

మెదక్, హన్మాజీపేట, ఎల్లారెడ్డి, ఇందల్వాయి, నర్సాపూర్ బాలికల పాఠశాలల అడ్మిషన్ కౌన్సిలింగ్ ను ఎల్లారెడ్డిలోని  గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎల్లారెడ్డి గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఉన్నాయన్నారు.

కౌడిపల్లిలో..

మెదక్ జిల్లాలోని విద్యార్థులు కౌడిపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావాలన్నారు. నర్సాపూర్ జూనియర్ కళాశాల, నర్సాపూర్ సీఓఈ జూనియర్ కళాశాల, కౌడిపల్లి పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ఖాళీల భర్తీ ఉంటుందన్నారు.



Post a Comment

أحدث أقدم