Top News

Public Angry on Muncipal Officers |బాన్సువాడలో వీధి కుక్కల బెడదపై ప్రజల ఆగ్రహం

బాన్సువాడలో వీధి కుక్కల బెడదపై ప్రజల ఆగ్రహం  

మున్సిపల్ ఆఫీస్ ముట్టడి - నేడు ఆరుగురు చిన్నారులపై దాడి

కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు : మున్సిపల్ కమిషనర్ 

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద వల్ల గురువారం ఏకంగా ఆరుగురు చిన్నారులను కుక్కలు కాటేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నలుగురు, గురువారం ఆరుగురు మొత్తం 11 మందికి కుక్కలు కాటేసాయ్.


మున్సిపల్ ఆఫీస్ ముట్టడి - బీఆరెస్ మద్దతు

గురువారం మధ్యాహ్నం ఆందోళన చెందిన తల్లిదండ్రులు, స్థానికులు మున్సిపల్ కార్యాలయాన్ని దిగబంధం చేశారు. వెంటనే కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా బీఆరెస్ నాయకులు షేక్ అక్బర్, ఫెరోజ్, బాడీ శ్రీనివాస్, ఇసాక్  తదితరులు ధర్నా నిర్వహించారు. రోజురోజుకూ వీధి కుక్కల బెడద పెరుగుతోందని, వరుసగా చిన్నారులపై దాడులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లలను ఇళ్ల బయటకు పంపాలంటేనే ఆందోళన చెందుతున్నామని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, చిన్న పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాన్సువాడలో కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతి

 బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండగా,మున్సిపల్ పాలకులు,అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ ఆరోపించారు.

గురువారం కుక్కల దాడిలో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ,గత రెండు రోజులుగా పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు.ఈ దాడుల్లో సుమారు పది మంది చిన్నారులు,ఒక మహిళ తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి,నిజామాబాదు ఆసుపత్రి లలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలని,కుక్కలను పట్టుకుని తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల భద్రత విషయంలో ఇకపై నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్,నాయకులు షఫీ,గంగారాం,కాసుల బాబు,ఖాలేద్,అఫ్జల్,ఫయాజ్, క్షతగాత్రులు,తదితరులు పాల్గొన్నారు.


వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాన్సువాడ మున్సిపల్ కమీషనర్, చైర్‌పర్సన్ వెంటనే స్పందించి పట్టణంలోని వీధి కుక్కలను నియంత్రించి, అమాయక పిల్లల భద్రతను కాపాడాలని కోరుతున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని, వీధి కుక్కలు కనిపిస్తే దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కమిషనర్ ప్రకటన

కుక్కల బారి నుండి చిన్నారుల భద్రతకు పురపాలక సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.

ఇటీవల పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసిన సంఘటనల నేపథ్యంలో, పురపాలక సంఘం దీనిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు చేపట్టిందని తెలిపారు.

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వీధి కుక్కలను గుర్తించి పట్టుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో జంతు సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

👆👆
తేదీ:30.07.2026.బాన్సువాడ టీచర్స్ లో ఉండే గోతి నానక్ సింగ్  కూతురు రిషిత ఇంటివద్ద ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుక్కలు దాడిచేసి తీవ్ర గాయం చేశాయి. దగ్గర్లో ఉన్న మాతాశిశు సంరక్షణ హాస్పిటల్ లు వెళ్లగా, తదుపరి చికిత్స కొరకై నిజామాబాద్ గవర్నమెంట్ కి వెళ్లాలని కోరగా, 108 సిబ్బంది ఈ యం టీ ప్రసాద్, పైలెట్ సుభాష్ లు వెంటనే చేరుకొని ఈఆర్సిపి సలహా మేరకు, తగిన చికిత్స అందించుకుంటు నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.










Post a Comment

أحدث أقدم