Top News

Rail Accident | కామారెడ్డిలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కామారెడ్డిలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి  

బృందావన్ కాలనీ సమీపంలో ఘటన  

మృతదేహంపై పచ్చబొట్టు, వెండి కడియం, రాగి తాయత్తు  

ఆచూకీ కోసం రైల్వే పోలీసుల విజ్ఞప్తి  

సమాచారం ఉంటే రైల్వే ఎస్సైకి తెలపాలని సూచన  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

కామారెడ్డి బృందావన్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ నంబర్ 513 బై 9/10 వద్ద ఈరోజు ఉదయం 9.40 గంటలకు ముందు గుర్తు తెలియని మగ వ్యక్తి రైలు కిందపడి మృతి1 చెందాడు.  

మృతుడి వయసు అందాజా 40 నుంచి 50 ఏళ్లు ఉంటుంది. ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు, చామనఛాయ రంగు, గుండ్రటి ముఖం, నల్లటి వెంట్రుకలు ఉన్నాయి. కుడి చేతిపై జే నర్సింలు అని పచ్చబొట్టు ఉంది. కుడి చేతికి వెండి కడియం, మెడలో నల్లని దారంతో రాగి తాయత్తు ఉన్నాయి. వైట్ కలర్, గోధుమ రంగు పూల డిజైన్ ఉన్న షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు.  

మృతుడి వివరాలు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే ఎస్సై సాధు లింబాద్రిని 87126 58614 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.




Post a Comment

أحدث أقدم