పౌష్టిక అల్పాహార పథకం అమలుకు ఏర్పాట్లు వేగవంతం : ఆర్డీఓ
నిజాంసాగర్‌లో కిచెన్ కోసం AMC గోదాం పరిశీలన
2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
నిజాంసాగర్, తెలంగాణ డైలీ న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు _పౌష్టిక అల్పాహార పథకం (Breakfast Scheme)_ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న నేపథ్యంలో, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి.
ఈ క్రమంలో నిజాంసాగర్ మండల కేంద్రంలోని AMC గోదాంను పథకానికి అవసరమైన కిచెన్ వంట గదిగా వినియోగించే అవకాశాలను ఆర్డీవో రవీందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి పరిశీలించారు.
గోదాంలో అందుబాటులో ఉన్న స్థలం, వంటశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం సిద్ధం చేసే అవకాశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈ గోదాం పథకం అమలుకు అనుకూలంగా ఉందని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పౌష్టిక అల్పాహార పథకం విజయవంతమైన అమలుకు స్థానిక స్థాయిలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు.


إرسال تعليق