ఆపదలో ఆదుకున్న నేత - మృతురాలి కుటుంబానికి షబ్బీర్ అలీ భరోసా
రూ.50 వేల తక్షణ సాయం, ఆసుపత్రి బిల్లుపై సీఈఓకు విజ్ఞప్తి
అర్ధరాత్రి స్పందించిన ప్రభుత్వ సలహాదారు
కామారెడ్డి: కష్టంలో ఉన్న కుటుంబాలకు తక్షణ అండగా నిలిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరోసారి తన మానవీయ కోణాన్ని చూపించారు.(video 👇)
కామారెడ్డికి చెందిన నూర్ జహాన్ షేక్ గుండె జబ్బుతో హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చికిత్స బిల్లు మొత్తం రూ.3.11 లక్షలు కాగా, కుటుంబం ఇప్పటికే రూ.1.80 లక్షలు చెల్లించింది. మిగతా మొత్తం చెల్లించకపోతే మృతదేహాన్ని ఇవ్వబోమని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో కుటుంబం తీవ్ర అగచాట్లకు గురైంది.
ఈ విషయాన్ని గురువారం రాత్రి సమద్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన షబ్బీర్ అలీ కేర్ ఆసుపత్రి సీఈఓ శశికాంత్‌కు ఫోన్ చేసి మానవతా కోణంలో ఆలోచించాలని, పెండింగ్ బిల్లును మాఫీ చేయాలని లేదా గణనీయమైన రాయితీ ఇవ్వాలని కోరారు.
అదే సమయంలో తన సొంత నిధుల నుంచి మృతురాలి కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. ఆసుపత్రికి తన సిబ్బందిని పంపి, యాజమాన్యంతో మాట్లాడి ఎలాంటి జాప్యం లేకుండా మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించే ఏర్పాట్లు చేయించారు.
ఆపద సమయంలో అర్ధరాత్రి సైతం స్పందించిన షబ్బీర్ అలీ చొరవను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుని ధన్యవాదాలు తెలిపారు. అవసరంలో ఉన్నవారికి అండగా ఉండే నాయకుడిగా మరోసారి ఆయన ప్రజల మన్ననలు పొందారు.



إرسال تعليق