మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు బిస్కెట్ల పంపిణీ
జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది : సాయి ప్రసాద్
నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ (TJA) 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను TJA జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు G. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల - స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్ లో విద్యార్థులకు బిస్కెట్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు.
జర్నలిస్టుల హక్కుల కోసం TJA పోరాటం
ఈ కార్యక్రమంలో సాయి ప్రసాద్ మాట్లాడుతూ, TJA ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కెవి రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం సాగుతోందని తెలిపారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా సంఘం నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాలు అభినందనీయం - సిద్దయ్య
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ, TJA ఆవిర్భావాన్ని కేవలం వేడుకగానే కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేత వంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు.
జర్నలిస్టుల వృత్తిగత భద్రత, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం TJA అసోసియేషన్ చేస్తున్న పోరాటాలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TJA ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, R.శ్రీనివాస్ రెడ్డి, P.యశస్వి, P. మురళీ కృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment