Top News

Blood Donation | రక్తదానం చేసిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు

రక్తదానం చేసిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు 

40 యూనిట్ల రక్త సేకరణ, సేవా కార్యక్రమాలను కొనియాడిన కమిషనర్

 తెలంగాణ డైలీ న్యూస్,  సిద్ధిపేట: స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్ధిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు.

రక్తదానం చేయడం వల్ల అనారోగ్యం రాదు: మున్సిపల్ కమిషనర్

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం చేస్తే అనారోగ్యాలకు గురవుతామన్నది అవాస్తవమని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారని, అలాంటి సమయాల్లో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ సమాజసేవలో ముందుకు రావాలని ఆకాంక్షించారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం: డాక్టర్ సాయిరాం 

కార్యక్రమంలో పాల్గొన్న చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయిరాం మాట్లాడుతూ, అత్యవసర సమయంలో రక్తదానం చేయడం శుభపరిణామమని తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు రక్తం ఎక్కువగా అవసరం ఉంటుందని, రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.

గత 3 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు: వాకర్స్ అసోసియేషన్  

మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గందె సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి గంప శివకుమార్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా తమ అసోసియేషన్ ద్వారా పర్యావరణహిత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నియంత్రణ, మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ప్రభుత్వాసుపత్రి రక్తనిధి కేంద్రం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమం చివర్లో రక్తదాత చంద్రశేఖర్‌ను సన్మానించారు.




Post a Comment

أحدث أقدم