Top News

Bus Accident | ఆర్టీసీ బస్సు ఢీకొని 8 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు ఢీకొని 8 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు 

డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో గ్రామస్థుల ఆందోళన

రుద్రూర్: రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.బోధన్ నుండి బాన్సువాడ వెళ్తున్న TS UB 3300 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఆదివారం అక్బర్ నగర్ గ్రామంలో కల్దుర్కి సిద్దార్థ అనే 8 ఏళ్ల బాలుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

బస్సు నిలిపి ఆందోళన  

ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అక్బర్ నగర్ గ్రామ యువకులు మాట్రిక్స్ స్కూల్ వద్ద బస్సును అడ్డుకుని ఆందోళన చేపట్టారు.

సమాచారం అందుకున్న రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనంతరం బస్సును రుద్రూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Post a Comment

أحدث أقدم