Top News

CM Revant in Marriage | జుక్కల్ ఎమ్మెల్యే కూతురు వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జుక్కల్ ఎమ్మెల్యే కూతురు వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  

వివాహ విందుకు హాజరు  

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం





బిచ్కుంద :ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  కుమార్తె జోనిట,  దాస్ల వివాహ విందుకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని సీఎం ఆకాంక్షించారు. (Video 👇)


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బిచ్కుందకు హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12.10 - 12.20 గంటలకు విచ్చేశారు. అక్కడి నుంచి నేరుగా వివాహ మండపానికి చేరుకుని వేదిక వద్దకు వెళ్లారు. ఆయన రాకతో నియోజకవర్గం వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. 

ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బిచ్కుంద పట్టణం, వివాహ వేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ముఖ్య ప్రాంతాల్లో పోలీసు బరికేడ్లు ఏర్పాటు చేశారు.వివాహానికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అధికారులు, స్థానికులు హాజరై వేడుకను కనుల పండుగగా చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ నరేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.వివాహ వేడుక వాతావరణం ఆనందోత్సాహాల మధ్య సాగింది.






Post a Comment

أحدث أقدم