Top News

BRS Protest | కళ్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్ పథకాలపై కామారెడ్డిలో బీఆర్ఎస్ భారీ నిరసన

కళ్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్ పథకాలపై కామారెడ్డిలో బీఆర్ఎస్ భారీ నిరసన

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హౌస్ అరెస్ట్

కామారెడ్డి/ఎల్లారెడ్డి:

పేద ఆడబిడ్డలకు ఆర్థిక చేయూతనిచ్చే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ నిరసనలు చేపట్టారు.

1. ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్ హౌస్ అరెస్ట్

లింగంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేయడానికి వెళ్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను పోలీసులు ముందస్తుగానే కామారెడ్డి జిల్లాలోని ఆయన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ, శాంతియుతంగా ధర్నా చేసే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలును నిలిపివేయడాన్ని నిరసించడం నేరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు.వీడియో 👇


2. కామారెడ్డిలో బీఆర్ఎస్ భారీ ధర్నా

అదే రోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. వేలాది మంది అర్హులైన లబ్ధిదారులు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని, హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదని ఆరోపించారు.వెంటనే బకాయిలు విడుదల చేసి పథకాన్ని బలోపేతం చేయాలని, రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


 కల్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్ కోసం కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆందోళన... జాజాల హౌస్ అరెస్ట్

కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ సోమవారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో లింగంపేటలో ధర్నాకు వెళ్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది.

వివరాలు:  

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు.

లింగంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు వెళ్తున్న జాజాల సురేందర్‌ను ముందస్తుగానే కామారెడ్డిలోని ఆయన స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జాజాల ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం నేతలు పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లారు.

అక్కడి నుంచి బీఆర్ఎస్ నాయకులు పాత జాతీయ రహదారిపై ఇంటర్నేషనల్ హోటల్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జాజాల ఆరోపణలు  

ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా పేద ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు.  

ప్రస్తుత ప్రభుత్వం ఇష్టం లేకనే సొంత మనుషులతో కోర్టులో కేసు వేయించిందని, కోర్టు 6 వారాల స్టే ఇవ్వడంతోనే పథకం ఆగిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు.  

"రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే ఎల్లారెడ్డిలోనే ఎందుకు అడ్డుకుంటున్నారు?" అని ప్రశ్నించారు.

వెంటనే హైకోర్టులో కౌంటర్ వేసి బకాయిలు విడుదల చేయాలని, పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు 

ఎల్లారెడ్డి :రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని పథకం ప్రకారంగానే నిలిపివేసే ధోరణి చేస్తున్నారని బారాస నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు 

బారాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు 

సోమవారం ఉదయం ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సురేందర్  ఆదేశాలతో స్థానిక తహసిల్ కార్యాలయం ఎదుట ధర్నా రాస్తారోకో నిర్వహించారు 

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ మాజీ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకంలో భాగంగానే హైకోర్టులో వారి అనుచరులతో పిటిషన్లు ఏపీస్తూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కల్లబొల్లి హామీలు చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు తులం బంగారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు ఉన్నది పోయింది అన్న చందనంగా తులం బంగారం దేవుడెరుగు అసలుకే ఎసరు పెట్టి సంక్షేమ పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తూ వాటితోపాటు తులం బంగారాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి బే షరతుగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ధర్నా కార్యక్రమం దాదాపుగా గంటపాటు కొనసాగించడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల మాజీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నర్సింలు వెల్లుట్ల సర్పంచ్ పటేల్ సాయిలు, ఉపసర్పంచ్ బొగ్గుల సాయిలు మాజీ కౌన్సిలర్ ఎరుకల సాయిలు శ్రవణ్ పాల్ద నారాయణ రవి నాగం రాజయ్య మల్లారెడ్డి దయాకర్ బబ్లు నాగరాజు తో పాటు బారాస నాయకులు పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم