CUETలో ప్రతిభతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన అంబిలిపూర్ నమ్రత
11 లక్షల మంది పోటీలో ఆంథ్రపాలజీ విభాగంలో ప్రవేశం
ఐఏఎస్ లక్ష్యంతో ముందడుగు - ఇప్పటికే సివిల్స్ కోచింగ్
బాన్సువాడ : కష్టపడితే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది కుమారి అంబిలిపూర్ నమ్రత. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహించిన CUET - Central University Entrance Test లో ఉత్తమ ర్యాంకు సాధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU లో ఆంథ్రపాలజీ విభాగంలో సీటు సాధించింది.
11 లక్షల మంది పోటీలో ఆంథ్రపాలజీ విభాగంలో ప్రవేశం
దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు రాసిన CUET పరీక్షలో నమ్రత అద్భుత ప్రతిభ కనబరిచింది. 5 సబ్జెక్టులు, ఒక్కో సబ్జెక్టుకు 250 చొప్పున మొత్తం 1250 మార్కులకు గాను 620 మార్కులు సాధించింది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ నిలకడగా రాయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు దక్కించుకుంది.
HCUలో ఆమెకు డిగ్రీ + పీజీ కలిపి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశంతో పాటు హాస్టల్ వసతి కూడా లభించింది. 10వ తరగతి 9.8 GPA, ఇంటర్‌లో 97% తో అద్భుత ఫలితాలు
చిన్నతనం నుండే చదువులో ప్రతిభ చూపిన నమ్రత 10వ తరగతిలో 9.8 GPA సాధించింది. ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో 1000 మార్కులకు 970 మార్కులు అంటే 97% తో ఉత్తీర్ణత పొందింది. ఐఏఎస్ కావాలన్నదే ఆమె అంతిమ లక్ష్యం. ఆ దిశగా ఇప్పటి నుండే ప్రణాళిక రూపొందించుకుంది.
ఐఏఎస్ లక్ష్యంతో ముందడుగు - ఇప్పటికే సివిల్స్ కోచింగ్
"అత్యుత్తమ ఐఏఎస్ అధికారిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలనేదే నా కల" అని నమ్రత తెలిపింది. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటికే సివిల్స్ ఆన్లైన్ కోచింగ్‌కు అడ్మిషన్ తీసుకుంది. HCUలో లభించే విద్యా వాతావరణం తన లక్ష్యానికి మరింత దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
తల్లిదండ్రులు హర్షం వ్యక్తం
నమ్రత విజయంపై తల్లిదండ్రులు అంబిలిపూర్ యశోద, సీనియర్ జర్నలిస్ట్ రాజు హర్షం వ్యక్తం చేశారు. "మా కూతురు లక్ష్యసాధనకు అన్ని విధాల సహకారం అందిస్తాం. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాం" అని వారు పేర్కొన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న కుమారి నమ్రతకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

إرسال تعليق