Top News

Exise Cases | అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు

అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు 

కామారెడ్డి ఎక్సైజ్ శాఖ దాడులు: 2 నెలల్లో 294 కేసులు, 88 మంది అరెస్ట్

 జిల్లా ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని జిల్లా నిషేధ - ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి తెలిపారు. జూన్, జూలై నెలల్లో జిల్లా వ్యాప్తంగా చేసిన తనిఖీలు, దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు.

గత రెండు నెలల్లో శాఖ అధికారులు 294 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్ట్ చేశారు. దాడుల్లో 40.96 కిలోల గంజాయి, 125 లీటర్ల గుడుంబా, 7.5 లీటర్ల NDPS మద్యం, 33 లీటర్ల అక్రమ IML, 27 లీటర్ల దేశీ మద్యం, 28 లీటర్ల బీర్ స్వాధీనం చేసుకున్నారు. 107 కల్లు శాంపిల్లు సీజ్ చేయగా, 4,520 లీటర్ల పులియబెట్టిన పాకాన్ని ధ్వంసం చేశారు. 2 వాహనాలను కూడా సీజ్ చేశారు. బ్రౌన్ షుగర్ కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ కార్యకలాపాలను అదుపు చేయడంలో భాగంగా జిల్లాలో రెవెన్యూ 10% పెరిగిందని అధికారి చెప్పారు. 41 రూట్ వాచ్‌లు ఏర్పాటు చేసి నిఘా పెంచామని, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వనమహోత్సవంలో భాగంగా 41,000 మొక్కలు నాటామని కూడా తెలిపారు.

సలాబత్పూర్ చెక్‌పోస్ట్ ఘటనలో పాల్గొన్న కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. 

అక్రమ మద్యం, గుడుంబా, డ్రగ్స్ అమ్మకాలు, రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Post a Comment

أحدث أقدم